పాలేరు లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన హరీష్ రావు

148
Harish Rao laid the foundation stone for the construction of the Government Nursing College in Paleru
Harish Rao laid the foundation stone for the construction of the Government Nursing College in Paleru

➡ ‘డబ్బు ఎక్కువ వుంది అని చదువు ఆపొద్దు’ అదే చదువు డబ్బు లేక ఆగిపోవద్దు’ : ఎమ్మెల్యే కందాళ…

➡ మన పాలేరు నియోజకవర్గంలో,రానున్న కాలంలో విద్య రంగంలో ఇంకా ఎన్నో ముందడుగులు వేయాలని ఆశిస్తూ,ఎప్పుడు మీ చదువుల కోసం నేనున్నాను అని మరోసారి మాటయిస్తున్న : ఎమ్మెల్యే కందాళ…

✍ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్య & ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారి తో పాటుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు,ఎంపీలు నామా నాగేశ్వరరావు గారు,వద్ధిరాజు రవిచంద్ర గారు,ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు,పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు,డీసీసీబీ చైర్మన్ కురాకూల నాగభూషణం గారు, విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు,రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లమల వెంకటేశ్వరరావు గారు,జిల్లా కలెక్టర్ VP.గౌతమ్ గారు,CP.విష్ణు వారియర్ గారు తదితరులు పాల్గొన్నారు.

✒ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన తెలంగాణ వచ్చాక,రాష్ట భవిష్యత్తు చదువు పైనే ముఖ్యంగా ఆధారపడి వున్నది అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి కెసిఆర్ గారు విద్యా రంగాన్ని ఒక ప్రత్యేక దృష్టితో నిజమైన దార్శనిక విజ్ఞతతో తెలంగాణలో శిధిలమైన విద్యా పునాదులను నిశితంగా పరిశీలించి ఏ విధంగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలి,ఎటువంటి మౌలిక వసతులు కల్పించాలి,ఎన్ని కొత్త విద్యాసంస్థలు నిర్మించాలి,అనేటువంటి అన్ని రకాల అంశాలను పరిశీలించి,అంగన్వాడీ నుండి ప్రైమరీ స్కూల్ వరకు గురుకులాల నుండి వేద పాఠశాలల వరకు ఇంటర్ కాలేజీల నుండి ఉన్నత విద్యలైన మెడిసిన్,ఇంజనీరింగ్ ,నర్సింగ్ వరకు తెలంగాణ లో ఒక కొత్త విద్యా మోడల్ ని ప్రవేశపెట్టారు.

✒ఒక్క మాటలో చెప్పాలి అంటే ‘మన మొదటి అక్షరమైన ‘అ’ నుండి నేటి ప్రపంచ లక్ష్యమైన ‘అమెరికా’ వెళ్ళటానికి కావాల్సిన చదువులు అన్ని తెలంగాణలో వున్న ప్రతి నియోజకవర్గానికి చేరువ అయ్యేలా కెసిఆర్ గారు కృషి చేస్తున్నారు.
✒ఇంక నా మొదటి లక్ష్యం మన పాలేరు లో నియోజకవర్గంలో వున్న అందరి పిల్లలకు ఉన్నత విద్య అందించటం.సుమారుగా 40,౦౦౦ వేల మంది విద్యార్థులు వున్నా మన పాలేరు నియోజకవర్గం లో అంగన్వాడీ నుండి పదవ తరగతి కి 30,0000 వేల మంది వున్నారు.ఇంటర్,డిగ్రీ,వృత్తి సంబంధింత కోర్స్ ల కోసం ఇప్పటికి జిల్లా దాటి వెళ్తున్న పరిస్థితి దీనిని మార్చాలని ఉన్నత చదువులు కూడా మనం మన నియోజకవర్గం లోనే,మన జిల్లాలోనే చదివే అవకాశం కల్పించే విధంగా నేను కృషి చేస్తాను.

Harish Rao laid Government in