బాధితులను పరామర్శించిన పొంగులేటి ప్రధాన అనుచరుడు మేకల మల్లిబాబు యాదవ్

105
Mekala Mallibabu Yadav, the chief follower of Ponguleti, visited the victims
Mekala Mallibabu Yadav, the chief follower of Ponguleti, visited the victims

బాధితులను పరామర్శించిన పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
………………………………..
పాము కాటు గురై ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న పాలేరు నియోజకవర్గం కూసుమంచి గ్రామానికి చెందిన చెన్ను వెంకటరమణను యాదవ్, గుండె నొప్పితో బాధపడుతూ ఇటీవల స్టంట్ వేయించుకున్న నేలకొండపల్లి గ్రామానికి చెందిన లొడంగి పర్వతాలు యాదవ్ ను మరియు ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఏదులాపురం గ్రామ గొర్రెల సంఘం అధ్యక్షులు వేల్పుల లింగయ్య యాదవ్ సతీమణి సునీత కుటుంబాన్నిపొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి మరియుకుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి వ్యక్తిగతంగా గాని రాజకీయంగా గాని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న యాదవ సంఘం నాయకులతో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూBRS ప్రభుత్వం కురుమ యాదవులకు చేసింది తక్కువ చెప్పుకుంది ఎక్కువ తప్ప ఏమీ జరగలేదని సంవత్సరం క్రితం డీడీలు తీసి గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారని కానీ ప్రభుత్వం కావాలని దురుద్దేశంతో ఎన్నికల స్టంట్ కొరకు కాలయాపన చేస్తున్నదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియజేస్తానని కానీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నని, గతంలో గొర్రెల సంఘాలను ఏర్పాటు చేసింది, గొర్రెల సంఘాలకు ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంమే నని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హఫీజుద్దీన్, కణతాల నాగయ్య,పల్లెబోయిన శ్రీనివాస్, భారీ సురేష్ యాదవ్,బారి కృష్ణ యాదవ్, చెన్ను యాదగిరి, చెన్ను రవి, మెండే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Mekala Mallibabu Yadav, the chief follower of Ponguleti, visited the victims